Sri Vara Sidhi Vinayaka Temple, Kanipakam! Where Ganesha is growing year after year magically! |
Hello,
Happy Vinayaka Chaviti to all of you!
Do you know, that from today, Lord Ganesha celebrates his birthday through a grand festival called 'Brahmotsavam' at Kanipakam?
Do you know about Kanipakam, the magic Temple?
In this temple, Lord Ganesha is getting bigger and bigger by year. Proof? When you visit the temple, look at the Silver Kavachams that were made for him over the years. The last year's ornaments would not fit him!! Isn't it a miracle. This shows that Lord Ganesha is there, blessing us all, helping us out, granting our wishes, protecting us!
And coming back to the celebrations, its a 20+ day grand event where Lord Ganesha rides on various Vahanas and comes close to people - Ooregimpu - Ooru - means village, Yegimpu is called to tour the village so he comes in Ooregimpu with all grandeur and graces everyone who came to see him!
You can see the updates of Brahmotsavams in the official site of the temple.
Here is the link to the site:-
http://www.kanipakam.com/festivals.html
Also watch out for the special features on this temple and Brahmotsavam on all popular TV Channel News Networks!
Yours affectionately
Subhashini Ammamma
హలో
కాణిపాకం వర సిద్ధి వినాయకుని వైభవం తెలుసా మీకు? అక్కడ వెలిసిన వినాయకుని ప్రత్యేకత ఏమిటో తెలుసా!
అక్కడి వినాయకుడు అచ్చం మన ఇంట్లో పిల్లల్లాగే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాడు - ఎలా తెలుసు అంటారా?
వినాయకునికి చేయించిన వెండి కవచం ఆభరణాలు, వచ్చే సంవత్సరానికి పట్టకుండా, చిన్నగా అయిపోతాయి. ఇవ్వి మీరు కూడా చూడచ్చు. మనం వినాయకుడి దర్శనం చేసుకొని వచ్చిన తరువాత, అక్కడ పక్కన స్వామి కళ్యాణం అయ్యే ప్రదశానికి పక్కనే ఇంతక ముందు చేయించిన కవచాలు, ఆభరణాలు, సైజు వారీగా పెట్టారు.
ముందు చిన్నగా ఉన్న ఆభరణాలు, కవచం, నెమ్మదిగా కొలత పెరుగుతూ రావడం మన కళ్లారా చూడచ్చు ! ఎంత మహిమో కదా!
ఇంతటి మహిమ గల దేవుడికి 21 రోజుల బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవం జరుగుతుంది - అనేక వాహనాల మీద ఊరేగుతూ గణపతి మనకి దర్శనం ఇస్తాడు - మరి ఈ వైభవాన్ని ఎన్నో టీవీ చానెల్స్ కవర్ చేస్తాయి - తప్పకుండా చుడండి!
మీ
సుభాషిణి అమ్మమ్మ
Comments
Post a Comment